సినిమాల్లో పెళ్ళంటే పందిళ్ళు, తప్పెట్లు, తాళాలు అంటూ పాటలు పాడుకోవడం మామూలే. అలాగే విడాకులు అయ్యాక కూడా అలా చేసుకుంటే ఎలా వుంటుందనేది దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇన్‌డైరెక్ట్‌గా సమంత, నాగ చైతన్యకు సూచిస్తున్నారు. వీరిద్దరి వివాహం పెటాకులు అవుతుందని గత కొంతకాలంగా వార్త హల్ చల్ చేస్తుంటే సమంత అవన్నీ పుకార్లు అంటూ నిన్ననే తన సోషల్‌మీడియాలో కొంతమంది చేత మేచ్ ఫిక్సింగ్ ప్రశ్నలు వేయించుకుంది సమంత. కట్‌చేస్తే ఆడవారి మాటలకు అర్థాలేవేరులే అన్నట్లు మరుసటి రోజే చైతన్య మా బంధం విడిపోతుందన్నట్లు స్టేట్ మెంట్ ఇచ్చాడు.