"ఎవరైనా పిల్లలు, నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను" అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు... "నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటాను" అంటే మాత్రం గాభరాపడతారు. తల్లితండ్రుల ఆలోచనావిధానంలో మార్పు రావాలి" అంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు-నిర్మాత, "దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి.