అదేంటంటే..బీబీ హోటల్‌కి వచ్చే అతిథులను ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి పారిపోయేలా చేసి, వారందరిని గ్లామ్ ప్యారడైజ్‌కు తరలించారు. వీలైనంత ఎక్కువమందిని గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌కి తరలించాలి, వారు విజయం సాధించేలా చేస్తే.. చంటి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అవుతాడు. అయితే ఈ టాస్క్ అంత రసవత్తరంగా సాగలేదు.
అర్జున్ కూడా దొరికిందే చాన్స్ అని.. ఆమెతో అన్ని పనులు చేయించుకుంటున్నాడు. డబ్బులిచ్చి భుజమ్మీద చేయి వేసి ఫొటో తీయించుకోవడం, అన్నం తినిపించడం లాంటి పనులను శ్రీ సత్యతో చేయించుకుంటూ అర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు .