ఇక వీరి స్కిట్‌లో వేసే కామెడీ పంచ్ లకు కృతి శెట్టి, సుధీర్ బాబు తెగ నవ్వేశారు. ఇక మరోవైపు ఆర్ జె సూర్య విజయ్ దేవరకొండ వాయిస్‌తో ఈ వారం నేనే కెప్టెన్ అవ్వాలని చాలా డిఫరెంట్‌గా చెప్పుకొచ్చాడు. మొత్తానికి సెలబ్రిటీలు వచ్చిన ఎపిసోడ్‌లో హౌస్ లోని కంటెస్టెంట్‌లు అందరూ చాలా డిఫరెంట్గా వారి వారి టాలెంట్ తో గెస్ట్ లను ఆకట్టుకున్నారు. మరి ఈ వారం ఎవరు హౌస్ నుండి వెళ్తారో వేచి చూడాలి.
అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజన్ 6తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తాజా సీజన్ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా మొదలైంది. డ్యాన్స్‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత 21 మంది కంటెస్టెంట్స్‌ను అందరికీ పరిచయం చేశాడు.