Chiclets team, Ram Karthik
డైరెక్టర్ ముత్తు.యం. మాట్లాడుతూ..సినిమా అంటే నాకు చాలా ఇష్టం.తమిళ్ లో శంకర్ దగ్గర రోబో సినిమాకు , తెలుగులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఆసిసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.తమిళ్ లో ఒక సినిమా చేసిన తరువాత నిర్మాత శ్రీనివాసన్ తెలుగు, తమిళ్ సినిమాకు డైరెక్టర్ చేసే అవకాశం కల్పించారు.వారికి నా ధన్యవాదాలు. 90 జనరేషన్, 2కె జనరేషన్ పిల్లలకు, పేరెంట్స్ కు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల కెరీర్ గురించే ఆలోచిస్తారు. పిల్లలపై తల్లి తండ్రులకు ఎలాంటి ప్రేమ ఉంటుందో, అలాగే పిల్లలకు కూడా తల్లీ తండ్రులపై అదే విధమైన ప్రేమ ఉన్నా వారికి ఒక ఏజ్ వచ్చిన తరువాత వారి ఆలోచనలు రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నప్పుడు వారికి సొసైటీ నుంచి వారు ఏమీ తీసుకోలేరు, సొసైటీ వారికి ఏమీ ఇవ్వదు. ఫ్రెండ్స్ ఎవరూ ఏమి చెప్పరు. అటువంటి సమయంలో వారికి మంచి చెప్పే దైర్యం ఒక్కతల్లి, తండ్రులకు మాత్రమే ఉంటుంది.ఈ సినిమాను పేరెంట్స్, కిడ్స్ అందరూ వచ్చి చూడచ్చు ఇందులో లవ్, ఎంటర్టైన్మెంట్ , పేరెంట్స్ ఎమోషన్ ఇలా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది.కాబట్టి ఇందులో 90 కిడ్స్ కు,2 కె కిడ్స్ ఉన్న డిఫరెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మా చిక్లెట్స్ సినిమా చూడాలి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.