ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ.. అన్నపూర్ణమ్మపై చిన్మయి.. కేసు నమోదు

సెల్వి

గురువారం, 29 ఫిబ్రవరి 2024 (12:09 IST)
సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసినందుకు గాను చిన్మయిపై కేసు నమోదైంది. 
 
అన్నపూర్ణమ్మను చిన్మయి దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. దేశాన్ని కించపరిచేలా చిన్మయి మాట్లాడటం సరికాదని విద్యార్థి సాగర్ అన్నారు. అందుకే చిన్మయిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 
 
కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. మహిళలకు అర్థరాత్రి స్వాతంత్ర్యం ఎందుకంటూ ప్రశ్నించారు. రాత్రి 12 గంటల తర్వాత మహిళలకు బయట ఏం పని అంటూ అడిగారు. ఇప్పుడు ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువైపోయింది. మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా సరే.. పురుషులు ఏదో ఒకటి అనేటట్లుగా రెడీ అవుతున్నాం. 
 
ఎదుటివాళ్లదే తప్పు అనడం కాదు.. మనవైపు కూడా చూసుకోవాలని అన్నపూర్ణమ్మ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా ఫైర్ అయ్యారు. అన్నపూర్ణమ్మ వీడియోను షేర్ చేస్తూ.. ఆమె నటనకు అభిమానినని చెబుతూ, మనం అభిమానించే వాళ్లు ఇలా మాట్లాడటం బాధ కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ.. "ఇదొక .... కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు