మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్రికెటర్ శ్రేయాంక పాటిల్ చిన్నస్వామి స్టేడియంలో ఒక అభిమాని నుండి వివాహ ప్రతిపాదనను అందుకుంది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సమయంలో, కెమెరాకు ఓ అభిమాని చిక్కాడు. "మీరు నన్ను (శ్రేయాంక పాటిల్‌ని) వివాహం చేసుకుంటారా" అని ఓ ప్లకార్డు పట్టుకుని కనిపించాడు.
ఈ సంఘటన జరిగిన సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు నవ్వుతూ కనిపించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో శ్రేయాంక పాటిల్ నవ్వుకుంటూ కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
RCB
స్మృతి మంధాన, సబ్బినేని మేఘనల మెరుపుదాడి గుజరాత్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించేలా చేసింది.