దుమ్ము రేపుతున్న బాస్ 'ఖైదీ నెం 150'... 'బాహుబలి'ని పడగొడతాడా...?

బుధవారం, 11 జనవరి 2017 (14:11 IST)
మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏమిటో 10 ఏళ్ల విరామం తర్వాత కూడా మరోసారి రుజువవుతోంది. రికార్డులను క్రియేట్ చేయడమే కాదు తిరగరాయడం కూడా బాస్ చేసేందుకు ముందుకు దూసుకువెళుతున్నాడు. ఓవర్సీస్ లో ఖైదీ నెం. 150 చిత్రం దుమ్ములేపుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చిత్రం దూసుకవెళ్లింది. బాహుబలి తర్వాత ఈ ఫీట్ ను ఏ తెలుగు చిత్రం అందుకోలేకపోయింది. 
 
బాహుబలి ఓవర్సీస్‌లో మొదటి రోజు 1.36 మిలియన్ డాలర్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేయగా చిరంజీవి ఖైదీ నెం. 150 1.15 మిలియన్ డాలర్లు రాబట్టి బాహుబలి సరసన నిలబడింది. మొత్తం వసూళ్ల పరంగా బాహుబలి రికార్డును అధిగమించే అవకాశం ఉన్నదని అంటున్నారు. కాగా మొదటి రోజు వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 40 కోట్లు వుండవచ్చని అనుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రామ్ చరణ్ తొలిసారిగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్ రిపోర్టుతో ముందుకు వెళుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది.

వెబ్దునియా పై చదవండి