ఎన్నిక ప్రకటన రాకముందే ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు వంటి వారు ఈ సారి అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. కొంత మంది ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకుని సీనియర్ల మద్ధతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అందుకే దీనికి ఏదోవిధంగా పరిష్కరించాలని ఆన్‌లైన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబర్ 12న మా ఎన్నికలు జరపాలని ఫైనల్‌గా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కనుక ముందుగా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలికనుక ఆగస్టు 22న మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. సో. మెగా ఫ్యామిలీ కనుసన్నలలోనే ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.