మెగాస్టార్ చిరంజీవి నటించిన "శంకర్ దాదా ఎంబీబీఎస్" చిత్రాన్ని వచ్చే నెల నాలుగో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు. ఇది హిందీలో సంజయ్ దత్ నటించిన "మున్నభాయ్ ఎంబీబీఎస్"కు రీమేక్. ఈ చిత్రం చిరంజీవి సినీ కెరీర్లో ఓ మైలురాయిగా నిలించింది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం.. ఇపుడు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రానుంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చూపించిన కామెడీ టైమింగ్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. బాస్‌కు ముఖ్య అనుచరుడిగా, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ జీవించారు. దీంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరోమారు థియేటర్లలో సందడి చేయనుంది.