చిత్రపురి కాలనీలో అవినీతి పై వల్లభనేని అనిల్ అరెస్ట్. కమిటీ సభ్యులు ఎస్కేప్

డీవీ

సోమవారం, 3 జూన్ 2024 (13:06 IST)
Chitrapuri Colony
సినీ కార్మికుల కోసం ఇరవై ఏళ్ళ నాడు శంకుస్థాపన చేసి డా. ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిత్రపురికాలనీ నేడు పాలకుల వల్ల భష్ట్రు పట్టింది. ఒక్కో ఫ్లాట్ ముగ్గురు, నలుగురికి ఇవ్వడం వారి దగ్గరనుంచి డబ్బులు తీసుకోవడం.. ఫ్లాట్ ఇవ్వనివారికి తిరిగి డబ్బులు ఇవ్వకపోడంతో కోట్ల రూపాయల సొమ్మును ప్రస్తుత అధ్యక్షుడు అనిల్ వల్లభనేని పై గతనెల 22 న క్రిమినల్ రేసు నమోదైంది. దానితో అతన్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. దానితో తమకూ అన్యాయం చేశారంటూ మరింత మంది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు అందాయి. 
 
Chitrapuri kamiti with chiru
చిత్రపురి అక్రమ రిజిస్ట్రేషన్ ల పైన రాయిదుర్గం పోలీస్ స్టేషన్ లో సుమారు 6 కేసులు నమోదు అయ్యాయి.  చిత్రపురి సెక్రెటరీ పి ఎస్ ఎన్ దొరతోపాటు తొమ్మిది మంది కార్యవర్గం ఎస్కేప్ అయ్యారు. ఈ అవినీతి తెరాస ప్రభుత్వం లో జరిగిన వందల కోట్ల అవినీతిగా తెలుస్తోంది.
 
విజిలెన్స్ ఎంక్వయిరీ వేస్తె వేల కోట్ల కుంభకోణం తో పాటు పెద్ద పెద్ద తిమింగలాలు బయటకు వచ్చే అవకాశం వుంది.
 కాంగ్రెస్ ప్రభుత్వం లో చిత్రపురి నిజమైన సినీ కార్మికుల కు తప్పకుండ న్యాయం జరుగుతుంది -చిత్రపురి ఉద్యమకారులు తెలియజేస్తున్నారు.
 
చిత్రపురి అవినీతి లో అధికారులు మాజీ కమీషనర్ వీరబ్రహ్మయ్య, డి సి ఓ ధాత్రి దేవి,మాజీ కమీషనర్ రఘునందన్ రావు ల భాగస్వామ్యం అవడం విశేషం.  ఇక అలాట్మెంట్ లో లేని రిజిస్ట్రేషన్ లు మొత్తం క్యాన్సల్ అయే అవకాశం. 
 
చిత్రపురిలోనే అరవై ఎకరాల భాగంలో ట్విన్ టవర్స్ పేరు తో మళ్ళీ కోట్ల కుంబకోనానికి ప్రణాళిక. సిద్ధం చేసి కొత్త సభ్యులను తీసుకుని కోట్లరూపాయలు తీసుకోవడంపై మరో కేసు నమోదు అయింది.  కోర్ట్ ఆర్డర్ లు, వందల కొద్దీ పిర్యాదులు పట్టించుకోని అధికారులు .. అవినీతి కమిటీ సభ్యులకు సుమారు మూడు నుండి ఏడు సంవత్సరాల శిక్ష పడే అవకాశం వుందని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
అధ్యక్షుడు అనిల్ పై నాన్ బెయిల్ సెక్షన్స్ 409,120B..
పరారి లో  లో టీవీ -9 న్యూస్ రీడర్ దీప్తి వాజేపీయి ..సెక్రెటరీ దొర, ట్రెసరర్ లలిత..
ఆఫీస్ కి తాళం వేసి సొసైటీ అకౌంట్ లు ఫ్రీజ్ చేసి రికార్డు లు, హార్డీస్క్ లు స్వాధీనం చేసుకోవాలని అధికారులని ఆదేశించిన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరావు. .
ఈ ఒక్క సంవత్సరo లోనే సుమారు 200 కోట్ల స్కామ్.
 
ట్విన్ టవర్స్ కాంట్రాక్టు ఇప్పిస్తానని రెండు కోట్లు
తన పర్సనల్ అకౌంట్ కి తీసుకున్న ఓ కళ్యాణ్? 
ట్విన్ టవర్స్ ప్లాన్ అనేది పెద్ద బొకస్, పర్మిషన్ లులేవు ఎవరు కట్టొద్దు అని ఉద్యమకారులు చెప్పినా వినకుండా సుమారు 70 మంది కట్టి మోసపోయినట్లు గుర్తుంపు. .
తన తండ్రి కాలు తీసేసారు నేనే దగ్గరుండి చూసుకోవాలి ,చిత్రపురి స్కామ్ మొత్తం పాత కమిటీ చేసింది నేను కేవలం ఉద్యోగిగా వచ్చాను నాకు బెయిల్ ఇవ్వండి అని కోర్ట్ లో సినిమా స్టోరీ లు చెప్తున్న వల్లభనేని అనిల్ కుమార్. .
మిగతా కమిటీ సభ్యుల ఆచూకీ కోసం రాయిదుర్గం పోలీస్ లు గాలింపు. .
ఏసీబీ కి కూడా పిర్యాదు చేసిన బాధితుల. .
త్వరలో ఆక్రమ ఆస్తుల కేసులో కూడా శిక్ష లు పడే అవకాశం. .
ఇకనైనా మారండి చిత్రపురి ని బాగుపరుద్దాం అంటున్న ఉద్యమకారులు. .
చిత్రపురి అవినీతి ఫై త్వరలో అధికారులు వీరబ్రహ్మయ్య, ధాత్రి దేవి, హరిత పైన కూడా విచారణ జరిపే అవకాశం. .
జూన్ 6 ఎలక్షన్ కోడ్ తరువాత విజిలెన్స్ ఎంక్వయిరీ పడే అవకాశం. .
గత 9 సంవత్సరాలనుండి తెరాస హయాంలో జరిగిన చిత్రపురి వందల కోట్ల అవినీతి ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెలికి తీసే అక్రమార్కులకు శిక్ష వేసే పనిలో ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు