25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు. ఏమి జరుగుతుందనే అవగాహన లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టాను. నా జీవితం మారిపోయింది. ఎంతో దయకలిగిన లెజెండ్‌తో తెరపై నా మొదటి పెర్ఫార్మెన్స్ మొదలైయింది. ఇప్పుడు హనుమాన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇదంతా కలలా అనిపిస్తుంది. ఈ కల మీ అందరివలనే జీవం పోసుకుంది. మీరంతా నా కుటుంబం. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి కారణం మీ ప్రేమ, ఆదరణ. గుణశేఖర్ గారు, చిరంజీవి గారు, అశ్వినీదత్ గారు మీరంతా ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేశారు ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో వుంటాను. అంటూ తేజసజ్జ తెలిపారు.