chiru, klin Kara Konidela
అభిమానుల అభిమానం హద్దులు దాటింది. పద్మభూషణ్, మెగాస్టార్, డాక్టర్, శ్రీ చిరంజీవి గారికి నా మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. నాటి పురాణాల్లో నందికి పరమశివుడు, హనుమంతుడికి శ్రీ రాముడు, అర్జునుడికి శ్రీ కృష్ణుడు.. నేటి మానవ జీవితంలో ఈ మెగాభిమానికి మీరు.. నా ప్రత్యక్ష దైవం.. చిరంజీవి అందరూ మీకు అభిమానులే.. నేను మాత్రం మీకు భక్తుడిని.. సినిమాల్లో మీరెంతోమందిని అలరించారు.. నన్ను ప్రభావితం చేశారు.. ఏళ్లు గడుస్తున్నా మిమ్మల్ని చూస్తే అదే ఆరాధ్యభావం.. అదే తన్మయత్వం.. మీ మాట నాకు వేదం.. మీ నడవడిక నాకు ఆదర్శం.. మీ ఆదేశం నాకు శాసనం.. అంటూ వీరాభిమాని స్వామి నాయుడు పరవశించిపోయారు.