పార్టీలు విడిపోవడం, మళ్లీ కలవడం వంటి చర్యలతో తమిళ ప్రజలను ప్రభుత్వం వెర్రివాళ్లను చేస్తోందని ఆయన కామెంట్ చేశారు. తమిళుల తల మీద గాంధీ టోపీ, కాషాయం టోపీ, కాశ్మీర్ టోపీలతో పాటు ఇప్పుడు జోకర్ టోపీ కూడా పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా, సోషల్ మీడియా ద్వారా తమిళ రాజకీయాలపై ప్రభావం చూపించడానికి ప్రభుత్వ పనితీరుపై స్పందించాల్సిందిగా తన అభిమానులను కమల్ ఉసిగొల్పడంపై తమిళ ప్రభుత్వం ఒకింత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా, కమల్ ట్వీట్లపై మంత్రులు కూడా తమకుతోచిన విధంగా స్పందిస్తున్న విషయం తెల్సిందే.