టాలీవుడ్ పెద్దలకు నోరు పెగలడం లేదు.. ఎందుకని? పృథ్వీరాజ్

మంగళవారం, 28 మే 2019 (15:38 IST)
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలపై హాస్య నటుడు పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన్ను అభినందించేందుకు క్యూకట్టిన టాలీవుడ్ పెద్దలు... ఇపుడు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తెలుగు సినీ పెద్దలారా?... ఏదైతో జరగకూడదని అనుకున్నారో.. అది జరిగేటప్పటికీ నోరు పెగలడం లేదా? జగన్‌ మోహన్ రెడ్డిని అభినందించడానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రాయలేకపోతున్నారా? గతంలో చంద్రబాబు గెలిస్తే.. ఉదయం విమానంలో విజయవాడ వెళ్లి చంద్రబాబును అభినందించి సాయంత్రం తిరుగు విమానంలో ఇంటికి చేరుకున్న టాలీవుడ్ పెద్దలు... ఇపుడు జగన్ అఖండ గెలుపు వాళ్ళకి వినిపించలేదా? కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, జగన్ సునామీ ధాటికి వైకాపా అఖండ విజయం సాధించిన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హీరో నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, నిర్మాత దగ్గుబాటి సురేష్‌ల చెవిలో ఎవరూ వేసినట్టు లేదులా ఉందని పృథ్వీరాజ్ సెటైర్లు వేశారు. ఈయన వ్యాఖ్యలు ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు