సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె కనిపించనుంది. ఇందుకోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటోంది. అయితే సన్నీలియోన్‌కు దక్షిణాదిన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అంతకుముందు బెంగళూరులో నిర్వహించే కొత్త సంవత్సర వేడుకల్లో సన్నీలియోన్ పాల్గొనాల్సింది.
అయితే సన్నీ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కర్ణాటక సర్కారు సన్నీలియోన్ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఫలితంగా సన్నీ షో బెంగళూరులో రద్దు అయ్యింది. తాజాగా చెన్నైలోనూ సన్నీ లియోన్‌కు చుక్కెదురైంది. సన్నీలియోన్‌పై సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా పోర్నోగ్రఫీని సన్నీలియోన్ ప్రచారం చేస్తుందని సామాజిక కార్యకర్త ఎమీ అక ఎనోక్ మోసెస్ నజరత్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.