తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నై మహానగర పోలీసులను ఆశ్రయించారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆర్.కె. నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారిద్దరి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్‌ప్ ద్వారా కొద్దిరోజులుగా హత్యా బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై గతంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
దీపా పేరవై నుంచి తొలగించిన దినకరన్ వర్గీయులు కూడా తనను బెదిరిస్తున్నారన్నారు. ఇందులో తన భర్తకు ఏ సంబంధమూ లేదని, రాజకీయంగా తమ మధ్య విరుద్ధ భావాలున్నా, కలిసి కాపురం చేస్తున్నామని దీప స్పష్టంచేశారు.