సినీ నటి అంజలి గ్యాంగ్.. దివ్యను కిడ్నాప్ చేసిందా? నిజమా?

శుక్రవారం, 18 మే 2018 (15:48 IST)
టీవీ, సినిమా నటి అంజలి గ్యాంగ్ దివ్య అనే యువతిని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు ఏమన్నారంటే.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఎస్సార్‌నగర్‌కు చెందిన టి.వెంకటేశ్‌(28), జి.దివ్య(24) ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. వీరిలో వెంకటేష్ నటి అంజలికి సోదరుడని తెలిసిందన్నారు. 
 
దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంజలి వద్ద విచారణ జరిపినట్లు పోలీసులు చెప్పారు. అయితే దివ్య మాత్రం తన ఇష్టం మేరకే వచ్చానని.. వెంకటేశ్‌తో ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా.. వారు అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అందుకే దివ్య, వెంకటేశ్‌ తమను ఆశ్రయించారని పోలీసులు చెప్పారు. 
 
తర్వాత ఇంట్లో చెప్పకుండా బల్కంపేటలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇష్టప్రకారమే వారి వివాహం జరిగిందని, తమను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. మేజర్లు కావడంతో ఇద్దరికీ వారి ఇష్టానుసారం వివాహం చేసుకునే హక్కుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు