'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ఠాగూర్

సోమవారం, 25 నవంబరు 2024 (10:24 IST)
'పుష్ప-2' చిత్ర దర్శక నిర్మాతలపై సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 'పుష్ప 2'కు తనతో పాటు మరికొంత మంది సంగీత దర్శకులతో వర్క్ చేయిచటం‌పై నిర్మాతలపై నవ్వుతూనే సైటైర్స్ వేశారు. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై దేవిశ్రీ‌ తన అస‌హ‌నాన్ని ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్‌లో బయటపెట్టారు. 
 
నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. నిర్మాత రవిశంకర్ ఉద్దేశించి మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్‌.. తాను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దన్నారు. ఎందుకంటే..తాను టైమ్‌కి పాట ఇవ్వలేదు టైమ్‌కి బ్యాక్ గ్రౌండ్ లేదు, టైమ్‌కు ప్రోగ్రామ్‌కు రాలేదు అంటుంటారనీ, మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ, ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి. ఈ విషయంలో మీకు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 
 
ఈ ఈవెంట్‌‌కు వచ్చేటప్పుడూ రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. తానెప్పుడూ ఆన్‌టైమ్ అన్నాడు. 'పుష్ప 2'కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే విషయంలో కొంతభాగంకి తమన్, శ్యామ్, అజనీష్ పని చెయ్యడం అనేది... హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ నిర్మాతలు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం కాగా‌‌, దీనిపై బన్నీ సుకుమార్‌ల పేర్లు తీసుకు రాకుండా  ప్రొడ్యూసర్స్‌కు తాను ఆన్‌టైమ్ అని చెప్పటం చర్చనీయాంశం అయింది. 
 
నిజానికి సుకుమార్ రీ షూట్‌ల వల్ల దేవిశ్రీ వర్క్ సైతం ఆలస్యం అయిందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో పబ్లిక్ ఈవెంట్‌లో తన తప్పేమీ లేదని దేవిశ్రీ క్లారిటీ ఇచ్చుకున్నాడా అనే  చర్చ మొదలైంది. ఈ సినిమా కథ, బన్నీ నటన మరో స్థాయిలో ఉంటాయని. తాను ఫస్టాఫ్‌కి ఫిదా అయినట్లు.. ఈ చిత్రం కోసం సుకుమార్, బన్నీ ఎంతో కష్టపడినట్లు, త్వరలోనే మరో పాట విడుదల కానుంది. అందులో బన్నీ ఊర మాస్ స్టెప్పులు చూస్తారని, చాలా మంది హీరోయిన్లు డ్యాన్స్ చేసిన తొలి స్పెషల్ సాంగ్‌కు తాను మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసినట్లు.. ఈ క్రెడిట్ ఏ సంగీత దర్శకుడికీ లేదని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. 

 

నేను ఫ‌స్టాఫ్ కే ఫిదా అయిపోయాను.
పుష్ప2లో బ‌న్నీలోని ది బెస్ట్ చూస్తారు..

- దేవిశ్రీ ప్ర‌సాద్‌ pic.twitter.com/eMO0RwB3PI

— Telugu360 (@Telugu360) November 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు