బాహుబలి ఫ్యాన్సుకు చేదు వార్త.. విజయేంద్రప్రసాద్ అలా అనేశారే?

సోమవారం, 8 మే 2017 (12:03 IST)
బాహుబలి ఫ్యాన్స్‌కు సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 ది- కన్‌‍క్లూజన్‌ ఘన విజయం తర్వాత మూడో భాగం కూడా వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే 'బాహుబలితో' తన పని పూర్తయిపోయిందని దర్శకదిగ్గజం రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
 
బాహుబలిని తామిప్పటికే పూర్తి చేశామని, మూడో భాగం వుండబోదని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. తాను కానీ, తన కుమారుడు రాజమౌళి కానీ దీనికి సంబంధించి ఏమీ అనుకోలేదన్నారు. బాహుబలి-3కి సంబంధించి తాను కథను రాయట్లేదన్నారు. అయితే బాహుబలి ప్రపంచం నుంచే ఎంతో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కామిక్ సిరీస్, టీవీ సిరీస్‌లు వస్తాయని తెలిపారు. 
 
సేమ్ సెట్స్ మీదే వీటి షూటింగ్ జరుగుతుందని... అందువల్ల బాహుబలికి ముగింపు లేదని తేల్చారు. బాహుబలి 3వ భాగానికి తాను కథ రాస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విజయేంద్రప్రసాద్ పునరుద్ఘాటించారు. 

వెబ్దునియా పై చదవండి