David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

సెల్వి

మంగళవారం, 4 మార్చి 2025 (14:07 IST)
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చాలా మందికి తెలుసు. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను షేర్ చేయడం ద్వారా బాగా పాపులర్. మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ మాట్లాడుతూ, డేవిడ్ వార్నర్ తమ రాబోయే చిత్రం రాబిన్ హుడ్‌తో భారతీయ సినిమాల్లోకి వస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ ఒక పాత్ర పోషిస్తున్నాడని చెప్పారు. 
 
తెలుగు పాటలకు నృత్యం చేయడం, క్రికెట్ స్టేడియంలలో తెలుగు పాటలకు స్వయంగా నృత్యం చేయడం వంటివి..   తెలుగు ప్రజలకు ఇష్టమైన వ్యక్తిగా మార్చాయని డేవిడ్ వార్నర్ అంటున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించే ఈ సంస్థ నిర్మిస్తున్న రాబిన్ హుడ్ చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించారు. 
 
దీంతో ఈ చిత్రంలో రాబిన్ హుడ్ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాబిన్ హుడ్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు