నిహారిక, చైతన్యలకు విడాకులు మంజూరు

మంగళవారం, 4 జులై 2023 (22:38 IST)
మెగాడాటర్ నిహారిక కొణిదెల, చైతన్యలకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది. నిహారిక కొణిదెల, చైతన్య విడిపోనున్నారనే వార్తలు కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 
 
కొన్నిరోజులుగా వీరి మధ్య మనస్పర్దలు రావడంతో కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫొటో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది. ఇటీవల చైతన్య తన ఇన్‌స్టా పేజి నుండి నిహారికకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. ఇద్దరిమధ్య అభిప్రాయభేదాలు రావడంతో కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు