2 సినిమాలతో నాగచైతన్య బిజీ బిజీ.. ఫస్ట్ లుక్‌పై కన్ఫ్యూజన్

బుధవారం, 29 మార్చి 2017 (10:45 IST)
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు క్రిష్ణ ముత్తు దర్శకత్వంలో మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వారాహి పతాకంపై రూపొందనుంది. 
 
ఈ మూవీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. చైతూ- కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలైన ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ఒక్కటి విడుదల కాలేదు. కనీసం టైటిల్ ఏంటనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సినిమాపై అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో చైతూ లుక్ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

వెబ్దునియా పై చదవండి