రమ్య అక్కడకి ఎందుకు వచ్చిందయా అంటే... ఆమె ఈ చిత్రంలో నటిస్తోందట. బాగా గుర్తింపు వున్న పాత్రలో నటిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తన ఇన్ స్టాగ్రాం పేజీలో వేసే స్టెప్పులు, పెట్టే రీల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు. ఐతే రమ్య మాత్రం వాటిని అస్సలు పట్టించుకోదు. తను ఏం చేయాలనుకుంటుందో అది చేస్తూ వెళ్లిపోతుంటుంది.