పార్టీపై క్లారిటీ ఇవ్వని రజనీకాంత్... ఫ్యాన్స్‌లో నిరాశ

గురువారం, 10 మే 2018 (08:50 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు మళ్లీ నిరాశకులోనయ్యారు. బుధవారం రాత్రి చెన్నైలో జ‌రిగిన "కాలా" ఆడియో వేడుక‌లో ర‌జ‌నీ త‌న రాజ‌కీయ పార్టీకి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తారని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ, ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
దీనిపై రజనీ స్పందిస్తూ, "నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి" అంటూ ర‌జ‌నీ త‌న పార్టీ ప్ర‌క‌ట‌న విష‌యాన్ని మ‌ళ్ళీ స‌స్పెన్స్‌లో పెట్టారు. అయితే 2021లో జరిగే ఎన్నికల్లో 234 స్థానాల్లో త‌న‌ పార్టీ అభ్యర్థులను బ‌రిలో దింప‌నున్నట్టు త‌లైవా ప్ర‌క‌టించ‌డంతో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లో రావ‌డం ప‌క్కా అని తేలిపోయింది. కానీ పార్టీ ఏర్పాటుపైనే ఆయన క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.
 
ఈ నేపథ్యంలో "కాలా" ఆడియో వేడ‌క‌లో మాట్లాడుతూ.. 'నాలుగు ద‌శాబ్ధాలుగా నా పని అయిపోయింద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. త‌మిళనాడు ప్ర‌జలు, ఆ దేవుడు నన్ను ముందుకు వెళ్ళేలా చేస్తున్నారు. ఎవ‌రెన్ని త‌ప్పుడు మాట‌ల‌ు మాట్లాడినా, నన్ను విమ‌ర్శించిన నా మార్గంలో నేను వెళుతుంటాను. ద‌క్షిణాదిన న‌దుల అనుసంధానం నా క‌ల‌. చెడు ఆలోచ‌న‌లు తొల‌గించండి, అప్పుడే జీవితం బాగుంటుంది' అని తలైవా పేర్కొన్నారు. ర‌జ‌నీ నటించిన "కాలా" జూన్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి యువకుడు పా. రంజిత్ దర్శకత్వం వహించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు