సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే... ప్రేక్షకాభిమానులకు రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రజనీ సినిమా వస్తుంది అంటే ఆఫీస్‌లకు ఎంప్లాయిస్ రారని గుర్తించి ఏకంగా సెలవే ప్రకటించేస్తారంటే... రజనీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. రజనీ నటించిన రోబో సీక్వెల్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ రాలేదు కానీ... కాలా మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
2.0, కాలా తర్వాత రజనీ సినిమాల్లో నటించడానికి కాస్త టైమ్ తీసుకుంటారేమో అనుకుంటే.. అందరికీ షాక్ ఇస్తూ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించేందుకు రజనీ ఓకే చెప్పారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రజనీ కెరీర్‌లో ఇది 165వ చిత్రం.
ఇక అసలు విషయానికి వస్తే.... ఈ సినిమాకు రజనీ రూ.65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క సినిమా కోసమే రజనీ 40 రోజుల కాల్‌షీట్లు కేటాయించారట. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 65 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ వార్తల్లో నిలిచిన ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో?