David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

దేవీ

సోమవారం, 24 మార్చి 2025 (16:01 IST)
Venky, david, Rajendra
ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ఓ పాత్రకు కావాలని తెలుగు సినిమా రాబిన్ హుడ్ లో దర్శకుడు వెంకీ కుడుముల  తీసుకున్నారు. సరదాగా వుండే ఓ పాత్రకు డేవిడ్ అయితే బాగుంటుందని నిర్మాతలతో అంటే.. దాన్ని వారు సార్థకం చేశారు. సినిమాలో ఆయన పాత్ర నిడివి తక్కువే. కానీ ఆయన్ను ప్రమోషన్ చేయడం హైలైట్ గా నిలిచింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన డేవిడ్..అందరికీ చేతులెత్తి సాంప్రదాయంగా నమస్కరించారు. అయితే ఫంక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
"ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్" అంటూ హెచ్చరించాడు. భాష తెలీయకపోయినా ఆయన నవ్వుకున్నారు. ఇక ఫంక్షన్ అయ్యాక రాత్రి రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలకు ఇంగ్లీషులో డేవిడ్ కు దర్శకుడు వివరిస్తూ ఫోన్ లో వివరించారు. దానికి ఆయన నవ్వి చాలా తేలిగ్గా తీసుకున్నారట.

క్రికెట్ లో ఇంతకంటే ఎక్కువగా తిడుతుంటారు. కామెంట్ చేస్తుంటారు. ఎమోషన్ అయ్యేలా మాట్లాడుతుంటారు. నటుల్లో కూడా ఇలా వుంటారా? అని డేవిడ్ అన్నారనీ, ఆయన స్పోర్టివ్ గా తీసుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని దర్శకుడు వెంకీ కుడుముల ఈరోజు ఇంటర్యూలో క్లారిటీ ఇచ్చారు.
 
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన శ్రీలీల, కేతికశర్మలు హీరోయిన్లుగా నటించగా, ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు