ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పై క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వార్నర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ కలర్ ఆరెంజ్ రంగులో డిజైన్ చేయడం విశేషం. కథపరంగా డేవిడ్ ను తీసుకున్నట్లు దర్శకుడు తెలియజేస్తున్నాడు. గతంలో క్రికెట్ గురించి సినిమాలు వచ్చాయి. కానీ ఇలా ఓ క్రికెటర్ తెలుగు సినిమాలో నటించడం ప్రత్యేకం. ఒకరకంగా యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నంకూడా కావచ్చుని తెలుస్తోంది. ఇంతకుముందు టెన్నిస్ క్రీడాకారణి జ్వాలా గుప్త కూడా మంచు విష్ణు సినిమాలో ఓ సాంగ్ లో నటించింది. కాగా, ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.