వారాంతం కావడంతో శని, ఆదివారాల్లోనూ అదే హవా కొనసాగించి మరో రూ.3 కోట్లకు పైగా వసూలు చేసి మొత్తం రూ.378.24 కోట్లతో స్టామినా చాటుకుంది. కేవలం దేశీయ మార్కెట్‌లోనే ఈ రికార్డ్ స్థాయి కలెక్షన్ 'దంగల్' సాధించడం సినీ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.713 కోట్ల మేరకు గ్రాస్ షేర్‌ను వసూలు చేసినట్టు సమాచారం.
ఇంతవరకూ నమోదైన కలెక్షన్ల ప్రకారం, మొదటివారంలో రూ.192.38 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో వారాంతానికి మరో రూ111.51 కోట్లు, మూడో వారాంతానికి రూ.44.03 కోట్లు సాధించింది. 30వ రోజు నాటికి రూ.375 కోట్లతో పాతరికార్డులను తిరగరాసింది. 'ఓకే జాను'. 'త్రిబుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' వంటి కొత్త చిత్రాల పోటీని కూడా 'దంగల్' తట్టుకుని ఐదోవారంలోనూ హవా కొనసాగిస్తుండటం గమనార్హం.