హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

ఠాగూర్

మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (16:31 IST)
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో బాలీవుడ్ కార్తిక్ ఆర్యన్ డేటింగ్‌లో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ - శ్రీలీల జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ, డేటింగ్‌కు దారితీసినట్టు సమాచారం. ఇదే అంశంపై బీ టౌన్‌తో పాటు టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అనేక వార్తా కథనాలు వచ్చాయి. వీటిపై తాజాగా కార్తి ఆర్యన్ స్పదించారు. 
 
ఆయన తాజాగా ఓ హిందీ చానెల్‌తో మాట్లాడుతూ, 'ఇండస్ట్రీలో నేను ఒక్కిడేనేనా ఉండేది. ఇంకా చాలా మంది ఉన్నారు. వారి గురించి ఎవరూ ఇలాంటి వార్తలు రాయరు. నా గురించి మాత్రమే అందరూ పిచ్చి రాతలు రాస్తుంటారు. ఇక్కడ నాకు సపోర్టు చేయడానికి ఎవరూ లేరు. బాగా వినండి.. అందరికీ చెబుతున్నా. చిత్రపరిశ్రమలో నాకు సినీ నేపథ్యం లేదు. సోదరులు, స్నేహితులు, ప్రియురాళ్లు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. వీటిని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే ఇలాంటి అసత్య ప్రచారం చేసేందుకు అనేక మంది ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటారు' అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు