వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ పలు విషయాలు తెలిపారు.
ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో ఆశించకూడదు. మేము వస్తున్నప్పుడు ఒకటే సినిమా అనుకున్నాం. కానీ రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇది మేము ముందుగా ఊహించలేదు. ఎవరి సినిమాలు. ఎవరి డేట్లు, ఎవరి కమిట్మెంట్లు వాళ్లకు ఉంటాయి. మనం చేస్తున్నప్పుడే సోలోడేట్ అని ఫిక్స్ అవ్వకుండా పోటీ తప్పదనే మైండ్ సెట్ తోనే దిగాలని భావిస్తాను.
నితిన్ ఇందులో క్యారెక్టర్ గురించి చెబుతూ..
- నా క్యారెక్టర్ ఇందులో వెరీ బిగ్ మానిప్లేటర్. చాలా స్మార్ట్ మైండ్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. క్లైమాక్స్ లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్టులు, షాకులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. భీష్మ సినిమాలో కంటే నా క్యారెక్టర్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ గా ఉంటుంది. వెరీ ఇంటలెక్చువల్ క్యారెక్టర్.
సెన్సార్ టాక్ గురించి దర్శకుడు మాట్లాడుతూ..
- సినిమా అంతా షుగర్ కోట్ లాగా ఫన్ కొటెడ్ గా ఉంటుంది. కానీ సినిమాలలో సోల్ ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది మీరు బిగ్ స్క్రీన్ లోనే చూడాలి. ఇప్పటివరకు చూసినవారు చాలా అద్భుతంగా ఉందని చెప్పారు