దక్షిణ భారత చలనచిత్ర రచయితల సంఘం అధ్యక్షుడుగా ఈ కథపై మాట్లాడిన ప్రమఖ దర్శక,రచయిత కె.భాగ్యరాజ్ మెడకు చుట్టుకుంది. ఆయన కథని లీక్ చేశారంటూ విమర్శలు వచ్చాయి. దాంతో క్షమాపణ చెప్పి ఆ పదవికి రాజీనామా చేశారు.
మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ సినిమా కథ విషయంలో భాగ్యరాజా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. సర్కార్ కథకు, రచయిత వరుణ్ రాజేంద్రన్ కథకు పోలికలున్నాయని భాగ్యరాజా స్టేట్‌మెంట్ ఇవ్వటమే సమస్యగా మారింది. సర్కార్ సినిమా కథను బయటకు చెప్పడంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ క్షమాపణ కోరింది.
ఈ సందర్భంగా భాగ్యరాజ్ క్షమాపణలు చెప్పారు. తాజాగా ఎస్‌ఐడబ్ల్యూఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికవడమే తనపై ఒత్తిడి పెరగడానికి కారణమైవుంటుందని.. భవిష్యత్తులో స్వచ్ఛందంగా పోటీ చేసి గెలుస్తానని ది బెస్ట్ అనేలా పని చేస్తానంటూ భాగ్యరాజ్ చెప్పారు. తన రాజీనామాకు సర్కార్ సినిమా వివాదానికి లింకు పెట్టొద్దని భాగ్యరాజా తెలిపారు.