పందెంకోడి-2తో హిట్ కొట్టిన విశాల్ ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్తున్నాడు. ఇప్పటికే విశాల్, వరలక్ష్మిల ప్రేమ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటానని విశాల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఎక్కడకు వెళ్లినా.. తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయని.. అందుకే తనకు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవాలని వుందంటూ విశాల్ తెలిపాడు.
తన లవ్ మ్యారేజ్ విషయంలో మా అమ్మానాన్నలకు కూడా ఎలాంటి అభ్యంతరంలేదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వరలక్ష్మి తన సోల్ మేట్ అని, తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. కానీ వరలక్ష్మినే చేసుకుంటాడా అనే దానిపై విశాల్ క్లారిటీ ఇవ్వలేదు. విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన వరలక్ష్మి శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంటారా.. లేకుంటే వేరే అమ్మాయితో విశాల్ వివాహం జరుగుతుందా అనేది చర్చనీయాంశమైంది.