ఆగస్టులో క్రిష్-రమ్యల పెళ్లి.. శరవేగంగా గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్!

శనివారం, 11 జూన్ 2016 (13:48 IST)
కంచె సినిమా దర్శకుడు క్రిష్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఇప్పటికే డాక్టర్ రమ్యతో క్రిష్ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టులో క్రిష్ మ్యారేజ్ జరుగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. పెద్దలచే కుదిర్చిన ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుంది. గమ్యం, వేదం వంటి సూపర్ గుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్.. గతేడాది తీసిన కంచె చిత్రంతో జాతీయ అవార్డు కూడా సాధించాడు. 
 
దీంతో పెళ్లికి క్రిష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రిష - రమ్యలు ఒకరినొకరు ఇష్టపడ్డంతో పెళ్లి ముహూర్తానికి సర్వం సిద్ధమైంది. రీసెంట్‌గా క్రిష్ అమ్మగారికి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ జరగ్గా.. వీరి కుటుంబంలో ఇతనే పెద్ద కుమారుడు. క్రిష్ తమ్ముడు ఇప్పటికే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. 
 
నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తీయడం ద్వారా.. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజైన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి