మాగ్జిమ్ అనే పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరనే దానిపై పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో అగ్రస్థానాన్ని ప్రముఖ మోడల్ హెయిలీ బాల్డ్‌విన్ కైవసం చేసుకోగా, టాప్-100 జాబితాలో బాలీవుడ్ సుందరాంగులు దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు స్థానం దక్కించుకున్నారు.
ఇంకా ఈ జాబితాలో ఎమ్మా వాట్సన్, ఎమ్మా స్టోన్, డకోటా జాన్సన్, కెండల్ జెన్నర్‌లకు చోటుదక్కింది. దీపికా, ప్రియాంక చోప్రా హాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో నటించిన తొలి సినిమా ట్రిపుల్ ఎక్స్‌తోనే దీపికకు బ్రహ్మాండంగా ప్రశంసలు లభించాయి. ఇక ప్రియాంక చోప్రా కూడా క్యాంటికో అనే అమెరికన్ టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ వారంలోనే ఆమె తొలిసారిగా నటించిన బేవాచ్ సినిమా కూడా రానుంది.
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసింది. ఆయన ముందు కాళ్లపై కాళ్లేసుకుని కూర్చుంది. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా నెటిజన్లకు కౌంటరిచ్చేందుకు తన తల్లితో లెగ్స్ తెలిసేలా ఉండే ఫోటోను పోస్టు చేసింది. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా టెలీమెడిసన్‌పై ఎంపీ జిల్‌హెన్నెస్సీతో భేటీ ఆయ్యారు.
కేటీఆర్ సందర్భంగా హెన్నెస్సీ శరీరాన్ని కప్పుకున్న దుస్తులతో కనిపించింది. భారత వ్యక్తులకు.. వారి సంస్కృతికి విదేశీయులు ఇలా గౌరవం ఇస్తుంటే.. ప్రియాంక చోప్రా.. భారత్‌ను హాలీవుడ్‌కు వెళ్లి.. ప్రధాని మోడీతో భేటీ అయినప్పుడు లెగ్స్ తెలిసేలా దుస్తులేయడం.. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందు కాలిపై కాళ్లేసుకుని కూర్చోవడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.