'దేవర' చిత్రానికి బిజినెస్ జరగలేదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ!

ఠాగూర్

శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు అగ్రహీరోలు పాన్ ఇండియా రేంజ్‌‍లో మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలుత ప్రభాస్, ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఉన్నారు. వీరంతా సోలోగా తమ‌ సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బిజినెస్ లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలకు దారితీశాయి. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు అతి తక్కువ బిజినెస్ ఫిగర్స్ కనిపించటం అభిమానులను‌ ఆశ్చర్యానికి గురిచెస్తోంది.
 
తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా బిజినెస్ రూ.113 కోట్లు ఓవర్సీస్ 26 కోట్లుగా చూపిస్తున్నప్పటికీ హిందీ వెర్షన్ కేవలం రూ.15 కోట్లకు మాత్రమే అమ్మడవటం జరిగినట్టు ప్రచారంలో సాగుతుంది. క ర్నాటకలో రూ.15 కోట్లు, తమిళంలో రూ.6 కోట్లు బిజినెస్ జరగగా, కేరళలో కేవలం రూ.50 లక్షలకే 'దేవర' బిజినెస్ హక్కుల అమ్ముడవటం అభిమానులను తీవ్ర నిరాశకు లోనుచేసింది. మళయాళ సినిమాలను తెలుగులో అనువదిస్తున్న క్రమంలో‌ మినిమం రెండు కోట్లకు కొని ఇక్కడ విడుదల చెస్తుంటే దేవర సినిమాను ఇంత చీప్‌గా రూ.50 లక్షలకు మాత్రమే బిజినెస్ జరగటంపై ట్రోలింగ్ జరుగుతోంది.
 
హిందీ వెర్షన్ కూడా రూ.15 కోట్లంటే మరీ తక్కువగానే భావించాల్సి ఉంటుంది. అయితే అది కూడా జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు ఉండటం వల్లే కరణ్ జోహార్ ఆ ఎమౌంట్‌కు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బాగా బిజినెస్ జరిగింది అనుకుంటున్న తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్‌ల హక్కులను కూడా నాగవంశీ తీసుకున్నారు కాబట్టి.. ఎమౌంట్ ఎక్కువ చేసి చూపించుకున్నారనే వాదన తొలి నుంచి ఉండనే ఉంది. ఎన్టీఆర్ వరకు అతను సోలో హీరోగా నటించిన గత చిత్రం "అరవింద సమేత"తో పోలిస్తే కెరీర్‌లో "దేవర"కు హయ్యెస్ట్ బిజినెస్ జరిగినట్లు అనుకున్నారు. మిగతా హీరోల పాన్ ఇండియా సినిమాలతో బిజినెస్‌తో పోల్చి చూస్తే దేవరకు జరిగిన బిజినెస్ ఏమాత్రం ఎంకరేజింగ్‌గా లేనట్లే ఉందని ఫ్యాన్స్ వాపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు