"హిట్లర్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్ లో రివీల్ చేశారు.
దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో "హిట్లర్" ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పర్ ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్ లో "హిట్లర్" మరో వైవిధ్యమైన చిత్రంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.