"నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. ఆ తరహా చిత్రాలు లెక్కలేనన్ని చూశాను. కానీ, దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. దానిని హైలైట్ చేస్తూ, "దెయ్యం గుడ్డిదైతే" అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ సినిమా సాయిరామ్ దాసరికి దర్శకుడిగా మంచి పేరు తీసుకురావాలని విష్ చేస్తున్నాను` అని వర్మ అన్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ మా "దెయ్యం గుడ్డిదైతే" చిత్రం ట్రైలర్ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
సుమీత్-జాకీర్-హైమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: రాఘవ, ఎడిటర్: రంగస్వామి, స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డి ఐ: జానీ బాషా, ఆడియోగ్రఫీ 5.1: శ్రీమిత్ర, టైటిల్స్ & పోస్టర్స్ ప్రవీణ్ తమటం, సమర్పణ: సంధ్య స్టూడియో, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: సాయిరామ్ దాసరి.