రవితేజ "ధమాకా" ఓటీటీ రిలీజ్ తేదీ వెల్లడి

ఆదివారం, 22 జనవరి 2023 (15:09 IST)
హీరో రవితేజే, శ్రీలీల జంటగా నటించిన చిత్రం "ధమాకా". నక్కిన త్రినాథనాథ రావు దర్శకుడు. గత యేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఏకంగా వంద కోట్ల రూపాయల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.100 కోట్ల చిత్రంగా రవితేజ సినీ కెరీర్‌లో నిలిచింది. పైగా, రవితేజ కెరీర్‌లో ఇదే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం కావడం గమనార్హం.
 
థియేటర్లలో అదిరిపోయేలా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. 
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించారు. భీమ్స్ సిరిరోలియో అదిపోయే సంగీతం ఇచ్చారు. ఈ చిత్రం 18 రోజుల్లో 108 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. ఇందులో రవితేజ యాక్టింగ్, కామెడీ టైమింగ్ చూసి మాస్ మహారాజ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. డ్యాన్సుల్లో శ్రీలీల అదరగొట్టేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు