శేఖర్ కమ్ములతో పని చేసేందుకు ఎక్సయిటెడ్ గా ఉన్నా - ధనుష్

శనివారం, 19 జూన్ 2021 (11:57 IST)
Dhanush twitter
అస‌లు తెలుగువారు ధ‌నుష్‌ను ఆద‌రిస్తారోలేదో అనే సంశ‌యం మొద‌ట్లో వుండేది. త‌య‌న న‌టించిన త‌మిళ సినిమా తెలుగులో తుపాకి విడుద‌లై మంచి పేరు తెచ్చుకుంది. అంత‌కుముందు ర‌ఘువ‌ర‌న్ బిటెక్ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ఇలా క్ర‌మేణా సినిమాలు డ‌బ్ చేస్తూ ర‌జ‌నీకాంత్ అల్లుడుగా వ‌చ్చిన ధ‌నుష్ తెలుగులోనూ సినిమా చేయాలే కోరిక‌తో ఎప్ప‌టినుంచో వున్నాడు. అది 2021లో సాధ్య‌ప‌డింది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు నిన్న‌నే ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ధ‌నుష్ఇ లా తెలియ‌జేశాడు. `శేఖ‌ర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరు. ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు. 
 
నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు గారి నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ధనుష్ కు తొలి స్ట్రైట్ తెలుగు సినిమా కానుంది.త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

వెబ్దునియా పై చదవండి