Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

సెల్వి

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (12:41 IST)
Thar Car
టైర్ కింద నిమ్మకాయ పెట్టి తొక్కించే ప్రయత్నంలో యాక్సిలేటర్ గట్టిగా అదమడంతో కారు కాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి రోడ్డుపై పడింది. ఢిల్లీలోని మహీంద్రా షోరూంలో జరిగిన ఈ ప్రమాదంలో కారు కొనుగోలు చేసిన మహిళతో పాటు షోరూం సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కొత్త థార్ వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఘజియాబాద్‌కు చెందిన మాణి పవార్ రూ.27 లక్షలు వెచ్చించి కొత్త థార్ వాహనం కొనుగోలు చేసింది. 
 
కారును రోడ్డెక్కించే ముందు పూజ చేసి నిమ్మకాయ తొక్కించేందుకు ప్రయత్నించింది. డ్రైవింగ్ సీటులో కూర్చున్న మాణి పవార్ పొరపాటున యాక్సిలేటర్‌ను గట్టిగా అదిమింది. దీంతో షోరూం అద్దాలను ఢీ కొట్టిన థార్.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాణి పవార్ తో పాటు మరొకరు గాయపడగా.. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

A new #Mahindra #Thar accidentally drove through the first-floor glass wall of a #Delhi showroom in #PreetVihar during a ceremonial delivery on 8 Sept. The #SUV flipped onto the street, damaging a nearby bike, but thankfully, no one was seriously hurt. Videos of the incident went… pic.twitter.com/PIUBmwhnqA

— Salar News (@EnglishSalar) September 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు