తమిళ హీరో ధనుష్ తల్లిదండ్రుల వ్యవహారం ఇపుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడిగా పేరొందిన కస్తూరి రాజా తనయుడిగానే ఇన్నాళ్లూ ప్రపంచానికి తెలిసిన ధనుష్.. తమ పుత్రుడంటూ కదిరేశన్, మీనాక్షి అనే వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది.
ధనుష్ తమ కుమారుడంటూ కోర్టును ఆశ్రయించిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ప్రస్తుతం మదురైజిల్లా మేలూరు మలియంపట్టిలో ఉంటున్నారు. కదిరేశన్ స్వగ్రామం శివగంగ జిల్లా కల్లూరనివిలక్కు. జీవనోపాధి కోసం మదురై జిల్లాకు మారారు. ధనుష్ అసలు పేరు కలైసెల్వన్ అని కదిరేశన్ చెబుతున్నారు.
మదురై నుంచి చెన్నైకు వచ్చిన ధనుష్.. తమిళ దర్శకుడు కస్తూరిరాజా చెంతకు చేరారు. వీరివద్దనే పెంచి పెద్దచేశారు. ధనుష్ అసలు పేరు వెంకట్‌ప్రభు అని, సాలిగ్రామంలోని అవిచ్చి పాఠశాలలో పదోతరగతి చదివాడని.. తర్వాత అతని పేరును ధను్‌షగా మార్చామని చెబుతున్నారు. ధనుష్ చదివిన యేడాది ఆ పాఠశాలలో వెంకట్‌ప్రభు అనే విద్యార్థి పదో తరగతిలో ఉన్నాడు కానీ.. అతడు ఎస్సీ అని రికార్డుల్లో ఉన్నట్టు సమాచారం. కానీ కస్తూరిరాజాది తేనిజిల్లా బోడినాయకనూరుకు చెందిన నాయకరాజుల వంశం కావడం ఇక్కడ ట్విస్ట్.
అల్లరి పిల్లవాడైన కలైసెల్వన్ 2002లో ఇంటి నుంచి పారిపోయినప్పుడు కల్లూరనివిలక్కు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కస్తూరి రాజా వద్ద డ్రైవర్‌గా పని చేస్తుండేవాడని, అతనే ధను్‌షను కస్తూరి రాజా వద్దకు చేర్చాడన్నది కదిరేశన్ దంపతుల వాదన. ధనుష్ తమకు పాఠశాల స్థాయి నుంచి తెలుసంటూ కోలీవుడ్‌లోని ఒకరిద్దరు సీనియర్లు వ్యాఖ్యానించారు. దర్శకుడు విసు ఇదేవిషయాన్ని ప్రకటించి కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశారు. మొత్తంమీద ధనుష్ అసలు తల్లిదండ్రులు ఎవరన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.