ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ మనకు లేదు... మన బటన్ మనమే నొక్కాలి.. అదే ఈవీఎం బటన్ : హరీశ్ శంకర్

ఠాగూర్

సోమవారం, 13 మే 2024 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున సినీ దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ మనకు లేదని, మన బటన్ మనమే నొక్కాలని ఆయన అన్నారు. ఈ రోజు ఆ బటన్ ఈవీఎం బటన్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేయడం కేవలం మన హక్కే కాదని, మన బాధ్యత అని కూడా ఆయన చెప్పారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభకు ఎన్నికల పోలింగ్ జరుగుంది. ఓటు వేయడానికి హైదారాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు ఏపీలోని తమతమ సొంతూర్లకు తరలివచ్చారు. సోమవారం ఉదయం కూడా ఎంతో తమతమ సొంతూర్లకు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
బటన్ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన వాళ్లు నాయకులు కాదన్నారు. వేరే రంగంలో సంపాందించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం తమ సంపాదన ఖర్చు పెట్టిన వాళ్లే మంచి నాయకులన్నారు. అలాంటి వాళ్ళను మనం గుర్తించాలని చెప్పారు. ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ  మనకు లేదని, మన బటన్ మనమే నొక్కాలని అన్నారు. ఈ రోజు ఆ బటన్ ఈవీఎం బటన్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు హరీశ్ వీరాభిమాని అయిన విషయం తెల్సిందే. అలాగే, పవన్‌కు ఇష్టమైన వ్యక్తుల్లో హరీశ్ శంకర్ ఒకరు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు