స్టార్ హీరో విజయ్ దేవరకొండతో "ఫ్యామిలీ స్టార్" సినిమాను నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆయన ఇవాళ వెల్లడించారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఐడీ, హెల్త్ కార్డ్, డైరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ గురించి ఇప్పటిదాకా రివీల్ చేయని ఓ విషయాన్ని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ స్టార్ గా చూపించేందుకు చేసిన సినిమా కాదని, ఒక ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని దిల్ రాజు చెప్పారు.