అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈ జర్నీలో ఎన్నో అనుభూతులున్నాయి. ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాం. మేం ఇతర భాషల్లో సినిమాలు చేస్తామని, మా ఆశిష్ హీరో అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నాం. ఈ జర్నీ ఓ అద్భుతం. ఎంతో మంది కొత్త దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, శ్రీకాంత్, భాస్కర్, వాసు వంటి వారిని పరిచయం చేశాం. ఇంకా ఐదారుగురు కొత్త దర్శకులు స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్‌గానే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్‌గా, ఎగ్జిబిటర్స్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణించడం గొప్ప జర్నీ. మా ఇంట్లో నుంచి ఆశిష్ హీరో అవుతాడని అనుకోలేదు. అయితే తనలో ఓ ఫైర్ ఉండేది. అది చూసినప్పుడు హీరో అవుతావా అని అడిగేవాళ్లం.
గత మూడేళ్లుగా తను శిక్షణ తీసుకున్నాడు. యు.ఎస్, బాంబే, వైజాగ్‌లో ట్రైనప్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలని చాలా మందికి కోరిక ఉంటుంది. వస్తారు కూడా. అయితే ఎంత మంది సక్సెస్ అవుతారనేది నేను ఈ ఇరవై ఏళ్ల జర్నీలో నేను దగ్గర్నుంచి చూశాను. అదంత సులభం కాదు. మా బ్యానర్ ఉంది. కథలను మేం విని ఓకే చేస్తాం. అయితే వీటన్నింటికీ మించి ప్రేక్షకులున్నారు. ప్రేక్షకులు ఓ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యి, కనెక్ట్ అయితేనే లాంగ్ రన్ ఉంటుంది. ప్రేక్షకులు పాస్ మార్కులు వేసే వరకు టెన్షన్ ఉంటుంది. ఉండాల్సిందే.
రౌడీ బాయ్స్ సినిమా విషయానికి వస్తే, ఓ హీరోను ఇంట్రడ్యూస్ చేయాలంటే ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ కావాలి. ప్రెజెంట్ యూత్ ఆడియెన్స్ ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది. డైరెక్టర్ హర్ష ఈ సినిమా కథను అలా ప్రిపేర్ చేశాడు. హుషారు తర్వాత హర్ష నన్ను కలిసినప్పుడు ఔట్ అండ్ ఔట్ యూత్ కంటెంట్ కావాలని అడిగాను. అప్పుడు తను ఈ పాయింట్ చెప్పి.. కథను డెవలప్ చేస్తూ వచ్చాడు. సినిమా దాదాపు పూర్తయ్యింది. అక్టోబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. హర్ష సినిమాను బాగా తీశాడు. సినిమా గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పను. దేవిశ్రీప్రసాద్, మది వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. అక్టోబర్ నెల కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్‌ఫుల్ సినిమా తీశానని ప్రొడ్యూసర్‌గా నమ్ముతున్నాను. మా బ్యానర్‌లో శతమానం భవతి, హలో గురూ ప్రేమకోసమే సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. లగడపాటి శ్రీధర్‌గారి అబ్బాయి విక్రమ్ దీంట్లో ఆశిష్‌కి అపోజిట్ రోల్ చేశాడు. అందరూ చక్కగా చేశారు అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ, మా ఫ్యామిలీలో నేను హీరో కావాలని అనుకున్న మొదటి వ్యక్తి మా అనిత అంటీ.. కానీ ఆమె ఈరోజు ఇక్కడ లేరు. ఆమెను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం నా బాధ్యత. అలాగే మా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎప్పటికీ మరచిపోలేను. నా ఫ్యామిలీ అందించిన సపోర్ట్ వల్లనే ఇక్కడున్నాను. అలాగే డైరెక్టర్ హర్ష నాతో మంచి సినిమా చేశాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.
డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ మనం కాలేజీ జాయిన్ అయిన కొత్తలో మనలో తెలియని ఓ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో మనకు తెలియకుండానే మనం రచ్చ చేస్తాం. ఈ సినిమాలోనూ అంతే మా బాయ్స్ చాలా రౌడీ పనులతో రచ్చ చేస్తారు. దాని వల్ల ఏం జరిగిందనేదే సినిమా. ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. శిరీష్‌గారి అబ్బాయి ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత, అందరూ ఆశిష్‌గారి నాన్న శిరీష్‌గారు అంటారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్ అన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, వి.వి.వినాయక్, సుకుమార్ తదితరులు మాట్లాడారు.