నంది అవార్డులపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి : గుణశేఖర్

ఆదివారం, 19 నవంబరు 2017 (09:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అవార్డుల ప్రకటించిన తీరును దర్శకుడు గుణశేఖర్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. 
 
నంది అవార్డులు రాకుంటే అడిగే హక్కు అందరికి ఉందని.. దీనిపై సీఎం క్లారిటీ ఇవ్వాలని గుణశేఖర్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త నిబంధనలతో చిన్నవారి గొంతునొక్కడమేనని నిలదీశారు. చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’కి ఎందుకు నంది అవార్డు రాలేదో సర్కార్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సర్కార్‌ను విమర్శించటం వెనుకు ఎలాంటి శక్తులు లేవన్నారు.
 
కాగా, ఈనెల 14వ తేదీన వెల్లడించిన నంది అవార్డుల్లో ఓ సామాజిక వర్గం తీసిన, నటించిన చిత్రాలకే అవార్డులన్నీ దక్కాయి. 2014లో మొత్తం 38 సినిమాలు ఎంట్రీకి రాగా, 2015లో 29, 2016లో 45 సినిమాలు నంది అవార్డుల కోసం ఎంపిక చేశారు. 
 
నంది అవార్డులే కాకుండా ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం, నాగిరెడ్డి - చ‌క్రపాణి జాతీయ సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం అందుకున్న వారి పేర్లను కూడా జ్యూరీ స‌భ్యులు ప్రక‌టించారు. ఈ అవార్డుల కోసం చిత్రాల ఎంపిక తీరుపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు