కంగనా రనౌత్.. ఎలా నిద్రపోతుందో అర్థం కావట్లేదు.. క్రిష్

ఆదివారం, 27 జనవరి 2019 (14:32 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక  సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణికర్ణిక కథానాయిక కంగనా రనౌత్‌పై దర్శకుడు క్రిష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మణికర్ణిక సినిమాలో తాను 30 శాతం మాత్రమే షూటింగ్ చేసినట్లు కంగనా చెప్పడంపై మండిపడ్డాడు. 
 
అర్హత లేకున్నా సినిమాలో ఆమె దర్శకత్వంపై ఫస్ట్ క్రెడిట్ తీసుకుందనీ, ఆమెకు ఎలా నిద్రపడుతుందో తనకు అర్థం కావడం లేదని దుయ్యబట్టాడు. తాను లేకుంటే సినిమాలో ఉండబోనని నటుడు సోనూ సూద్ స్పష్టం చేయడంతో మరో నటుడితో ఈ పాత్రను షూట్ చేశారన్నాడు. 
 
కాగా.. సినిమాకు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తవుతున్న దశలో అనివార్య కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్ జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మణికర్ణిక. ఈ సినిమా శుక్రవారం (జనవరి 25) భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు