దాసరిగారంటే 74 నిండిన వ్యక్తికాదు... 24 శాఖలు కలిసిన శక్తి : క్రిష్

బుధవారం, 31 మే 2017 (12:02 IST)
దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు మరణించారని అనకండి అంటూ దర్శకుడు క్రిష్ కోరారు. దాసరి మృతిపై యువదర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందించారు. హిందీ సినిమా 'మణికర్ణిక' పనుల్లో తలమునకలై ఉన్న క్రిష్... దాసరి మృతి చెందారనవద్దని అన్నారు. దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎవరన్నా... వినిపించేది దాసరి నారాయణరావేనని ఆయన స్పష్టంచేశారు. 
 
దాసరికి మరణం లేదన్నారు. భూమి మీద సినిమా చనిపోయినప్పుడు ఆయన మృతి చెందారందామన్నారు. దాసరి తీసిన 151 సినిమాలు ఆయన ఇంకా బతికే ఉన్నారని చాటుతాయన్నారు. సినిమా థియేటర్లలోనో, రీమేక్‌లుగానో, టీవీల్లోనో, వార్తల్లోనో ఆయన నిత్యం జీవించే ఉంటారన్నారు. ఆయన పూర్తి తెలుగులో ట్విట్టర్‌లో ఒక మెసేజ్‌ను పెట్టారు.
 
ముఖ్యంగా దాసరిగారంటే 74 యేళ్ళు నిండిన వ్యక్తిగాదు... 24 శాఖలు కలిసిన శక్తి.. ఇలాంటి వారికి జయ జయ ధ్వానాలు ఉంటాయి. కానీ జోహార్లు ఉండవు. దర్శకుడే సినిమాకు కెప్టెన్ అని ఎక్కడ ఎవరంటున్నా దాసరిగారు వింటారు. ఏ తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరిగారు ఉంటారు. 
 
గుండె ఆడకపోతే ఏం? దాసరిగారి సినిమా ఆడుతూనే ఉంటుందిగా.. థియేటర్స్‌లోనే, టీవీ చానెల్స్‌లోనే తాతా మనవడు మంచి 151వ సినిమాలున్నాయి. ఆడుతూనే ఉంటాయి. భూమ్మీద సినిమా అనేది లేనప్పుడు దాసరిగారు లేరనాలి. అది జరగదు కదా అని ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి