బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈవెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తక్కువ వ్యవధిలోనే దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ షూటింగ్ గ్యాప్‌లోనే ఆయన పెళ్లి చేసుకున్నారు. వెంటనే మళ్లీ షూటింగ్‌కు హాజరైపోయారు. పట్టుమని పదిరోజులు కూడా భార్యతో గడపలేదు.
ఈ నేపథ్యంలో శాతకర్ణి ఆడియో వేడుక సందర్భంగా తీసిన ఓ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఓ అమ్మాయి.. క్రిష్‌కు ముద్దు పెడుతుంటే.. హీరోయిన్ శ్రియ క్రిష్ గొంతు పట్టుకుని నొక్కేస్తుంది. ఇంతకీ ఫోటోలో క్రిష్‌కు ముద్దెట్టింది.. ఆయన భార్యే. కాగా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన భార్య అందించిన సహకారం మరువలేనిదని క్రిష్ శాతకర్ణి ఆడియో వేడుకలో తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయ్యింది. అంతకుముందు శ్రియ గొంతును క్రిష్ నొక్కినట్లు ఫోటోలు రిలీజయ్యాయి. ఈ ఫోటోను షూటింగ్‌లో తీశారు. ప్రస్తుతం ఇదే తరహాలో క్రిష్ గొంతును శ్రియ నొక్కేసింది.