అలాగే గేమ్ ఛేంజర్ లో పొలిటీషియన్ పై ఓ అస్త్రం ఎక్కుపెట్టాడు. అది హైలైట్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే అందులో నటించిన శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇందులో ఎవ్వరూ ఊహించని ఇంతకుముందు రాని అంశం వుంటుందనీ, పొలిటికల్ అంశమే అయినా ఏ పార్టీనిగానీ, వ్యక్తిగతంగాగానీ వేలుచూపేట్లుగా వుండదు. ఎవరికీ వర్తించదు. కానీ పాయింట్ మాత్రం మేథావులను, సామాన్యులను ఆలోచింపజేస్తుందని అది పార్లమెంట్ ను కూడా ప్రశ్నించేలా వుంటుందనీ తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ రెండు పాత్రలు చేశారు. అందులో ఒకటి ముసలి పాత్ర కాగా, రెండోది రామ్ చరణ్ యంగ్ లో వుండగా ఆయనకు తోడుగా వుంటే పాత్ర. ఆ తోడు ఏవిధంగా వుంటుందనేది కూడా సస్పెన్స్ అంటూ తెలిపారు.